ధాన్యంతో తరలివచ్చి భక్తారాధన

ఘనంగా పొట్యాల గ్రామ ప్రజలు 3 వ రోజు
అంతర్గాం, ఫిబ్రవరి:27, (నిజం న్యూస్)
అంతర్గాం మండలం పొట్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయాల్లో దేవతామూర్తుల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా, కొనసాగింది. 6 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో మూడవ రోజున సోమవారం గ్రామంలోని ప్రతిఇంటి భక్తిశ్రద్ధలతో ధాన్యంతో తరలివచ్చి భక్తారాధన చేశారు. శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతీ స్వామి, సంస్కృతాంధ్ర పండితులు, అష్టావధాని శ్రీ ముత్యం పేట గౌరీశంకర శర్మ ఆశీస్సులతో భక్తిశ్రద్ధలతో ఈకార్యక్రమంలో ప్రతిష్ట నిర్వాహకులు, ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.