ప్రీతి మృతికి కారణమైన నిందితుడిని ఉరి తీయాలి

సేవాలాల్ జిల్లా కమిటీ సభ్యులు ది ప్లా నాయక్.
అంబేద్కర్ సెంటర్ వద్ద గిరిజనులు కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి.
కుటుంబ సభ్యులకు కోటి రూపాయలు అందించాలని గిరిజనుల డిమాండ్
తుంగతుర్తి ఫిబ్రవరి 27 నిజం న్యూస్
వరంగల్ కాకతీయ వైద్య కళాశాల గిరిజన విద్యార్థిని ధరావత్ ప్రీతి చావుకు కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని సేవాలాల్ జిల్లా కమిటీ సభ్యులు దీప్లా నాయక్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద గిరిజన సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు ఆంగోతు వీరు నాయక్, గుగులోతు కాంతమ్మ రాములు నాయక్, గుగులోతు భాస్కర్, కటకం సూరయ్య, కటకం శ్రీనివాస్ గోపగాని వెంకన్న, కాసం రామ నరసయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.