ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని ఎస్టీ. ఎస్సీ.సంఘాల నాయకులు డిమాండ్
సిర్గాపూర్ :ఫిబ్రవరి 27(నిజం న్యూస్ )
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రంలో ఎస్టీ,ఎస్టీ సంఘాల నాయకులు గ్రామస్తుల ఆధ్వర్యంలో ప్రితి ఫోటోకి క్యాండిల్ లతో నివాళులు అర్పిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నేల 21న పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆమె హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.డాక్టర్ ప్రీతి కుటుంబాన్ని,ఆత్మహత్యకు కారకుడైన సైప్ అనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని,మండల కేంద్రంలో శివాజీ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.
ర్యాగింగ్ చట్టాలను పకడ్బందీగా చేయాలన్నారు.
ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలనీ డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బాబు. ఎస్టీ సెల్ అధ్యక్షుడు నారాయణ.మండల సోషల్ మీడియా అధ్యక్షుడు రమేష్. డీలర్ గురునాథ్.శంకర్ నాయక్. వినేయి.తుకారం.రాజు. గిరిజన విద్యార్థి సంఘం హరిసింగ్. లోంకతండా ఉప సర్పంచ్ రాజు.నాగరాజు.అల్తాఫ్. వివిధ సంఘాల నాయకులు తదితరులు ఉన్నారు.