మోతేఎంపీడీవోశంకర్ రెడ్డి అకాల మరణంఅత్యంత బాధాకరం

బి ఆర్ ఎస్ మండల సీనియర్ నాయకుడు దారమల్ల వెంకన్న*
మోతే: గుండెపోటుతో అకాల మరణం చెందిన మోతే ఎంపీడీవో వేమిరెడ్డి శంకర్ రెడ్డి మృతి చెందటం అత్యంత బాధాకరమని బి ఆర్ ఎస్ మండల సీనియర్ నాయకుడు దారమల్ల వెంకన్న (కండక్టర్) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల్లో రిటైర్మెంట్ కావలసిన ఎంపీడీవో శంకర్ రెడ్డి గుండెపోటుతో అకాల మరణం చెందడం దురదృష్టకరమన్నారు. మండలంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తూ మండలాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లిన ఎంపీడీవో శంకర్ రెడ్డి మృతి మండల ప్రజలకు తీరని లోటు అని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వివిధ సందర్భాలలో వారిని కలిసినప్పుడు ఫోన్ లో మాట్లాడిన సందర్భంగా నన్ను ఎంతో రిసీవ్ చేసుకుని సమస్యల పరిష్కారానికి దారి చూపిన మహానుభావుడు ఎంపీడీవో శంకర్ రెడ్డి అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఎంపీడీవో శంకర్ రెడ్డి కి బి ఆర్ ఎస్ పార్టీ మోతే మండల కమిటీ తరపున జోహార్లు అర్పిస్తున్నామని అన్నారు.