Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఘనంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

 

-పిఎస్ఎస్ ట్రస్టు ద్వారా విద్యార్థులకు చేయూత.

-18 మంది విద్యార్థులకు 1500 చొప్పున చెక్కుల పంపిణీ.

చేవెళ్ల ఫిబ్రవరి 26(నిజం న్యూస్)

చేవెళ్ల మండల కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలను పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కేక్ కట్ చేయించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ జేశారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుందని దానికి పార్టీ శ్రేణులు కార్యకర్తలు నిరంతరం కృషి చేయాలని అన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.

రాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, స్కాములు, మోసపూరిత హామీలను అన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రాబోవు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడుతరని అన్నారు. పిఎస్ఎస్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేద విద్యార్ధులకు చేయూతనిచ్చి ప్రోత్సాహకారంగా 18మంది విద్యార్థులకు ప్రతి ఒక విద్యార్థి కి 1500/- చొప్పున

27000 రూపాయల చేక్కులను అందజేసారు. బిజెపి చేవెళ్ల ఇంచార్జి కంజర్ల ప్రకాష్, బిజెపి నాయకులు వరి తులసి రామ్ విజయ్ కుమార్,చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ ప్రతాపరెడ్డి,చేవెళ్ల మండల అధ్యక్షులు దేవర పాండురంగారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, దళిత మోర్చా మండల అధ్యక్షులు అశోక్, చేవెళ్ల బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి,శంకర్పల్లి మండల అధ్యక్షులు రాములు గౌడ్, శంకర్పల్లి మున్సిపాలిటీ అధ్యక్షులు సురేష్, జిల్లా నాయకులు రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు నితీష్ రెడ్డి, మండల ఓబీసీ ఉపాధ్యక్షులు కుమార్ గౌడ్,బీజేవైఎం మండల అధ్యక్షులు పత్తి సత్యనారాయణ, బీజేవైఎం టౌన్ అధ్యక్షులు బండారి శేఖర్ రెడ్డి, బిజెపి పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,బిజెపి మండల ఉపాధ్యక్షులు శెర్వలింగం, కేశపల్లి వెంకటరామిరెడ్డి, జి.వెంకట్ రెడ్డి, కృష్ణ గౌడ్ ముడిమ్యాల శక్తి కేంద్రం ఇంచార్జ్ మహేందర్ గౌడ్, బీజేవైఎం జాయింట్ సెక్రెటరీ మహేశ్వర్ రెడ్డి, జిల్లా నాయకులు కుంచం శ్రీనివాస్, బీజేవైఎం జాయింట్ సెక్రెటరీ కరుణాకర్ రెడ్డి, బిజెపి నాయకులు ఆలూరు కృష్ణ, చాకలి శ్రీనివాస్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి భాస్కర్, మధుకర్ రెడ్డి, ఐటీ సెల్ అధ్యక్షులు అభిషేక్ రెడ్డి, నవీన్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు..