కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య చొరవతో పొలాలకు నీళ్లు

మోతే ఫిబ్రవరి 26 (నిజం న్యూస్):- మండల పరిధిలోని అన్నారుగూడెం ఉర్లుగొండ రాయికుంట తండా నరసింహపురం తుమ్మగూడెం నేరెడవాయి గోపతండ గ్రామాల రైతులు 15 రోజుల నుండి పాలేరు రిజర్వాయర్ నుంచి నీళ్లు అందకపోవడం వల్ల పొలాలు ఎండిపోతున్న సమయంలో కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ దృష్టికి తీసుకుపోగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఖమ్మం జిల్లా రిజర్వ్ అధికారులతో మాట్లాడి నీళ్లు పెరిగే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సూచన మేరకు అధికారులు స్పందించి నీళ్లు పెరిగే విధంగా ఏర్పాట్లు చేశారు. రైతులు ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకుడు దార మల్ల వెంకన్న (కండక్టర్) మాజీ సర్పంచ్ పెరుగు ఉపేందర్ ఉప సర్పంచ్ హనుమాచారి మాజీ ఎంపిటిసి పెరుగు మహేష్ గ్రామ శాఖ అధ్యక్షుడు గు గులోతు బోజ్యా (బాబు) తుమ్మగూడెం సర్పంచ్ కొడకండ్ల నర్సిరెడ్డి తుమ్మ గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు మాదగాని సత్యం రావుల గోపీచందర్ రెడ్డి కీతవీర శేఖర్ భూక్య మల్సూర్ సర్పంచ్ భూక్య నాగేశ్వరరావు కట్ల నర్సయ్య పోటూరి వెంకటేశ్వరరావు భూక్య బాలు చింతలపాటి రవి మామిడి సీతారాములు మండవ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు