ఉప్పల చారి ట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

మాడ్గుల ఫిబ్రవరి 26( నిజం న్యూస్): మాడ్గుల మండలంలోని ఉప్పల చారి ట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 27 నుండి మార్చి 4 తారీఖు వరకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్టు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 27న అప్పారెడ్డిపల్లి, 28న అవురుపల్లి, మార్చి 1న ఆర్కపల్లి ,2న ఇర్విన్, 3న కలకొండ,4న అందుగుల గ్రామాలలో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, మాడ్గుల మండల ఇన్ ఛార్జ్ నర్సంపల్లి సర్పంచ్ హనుమ నాయక్ తెలిపారు.