చందేపల్లి గ్రామంలో ముగిసిన శ్రీ సిద్ధి వినాయక, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవం

మోటకొండూర్: ఫిబ్రవరి 25(నిజం న్యూస్)
ఆలేరు నియోజకవర్గం మోటకొండూరు : మండలంలోని చందేపల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయంలో శ్రీ సిద్ధి వినాయక, నవగ్రహ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం బుధవారం నుండి ప్రారంభమై శుక్రవారంతో ముగిశాయి. శుక్రవారం ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యవచనము పీఠ పూజలు గర్త న్యాసము, యంత్ర ప్రతిష్టాపన బింబస్థాపన ప్రాణ ప్రతిష్ట కలాన్యాసము దృష్టి కుంభ పూర్ణాహుతీ మహాదశిర్వచనం శ్రీశ్రీశ్రీ భక్త సురేష్ గురువుల సహకారంతో భాగవత ప్రవచనాలు గంగా గౌరీశ్వర భజన మండలి పూస నరసింహ హైదరాబాద్ వారిచే భక్తి గీతాలు, బి.ఎం.ఆర్.ఎస్ స్కూల్ చిన్నారి నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ చేసి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సిద్ధి వినాయక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి దూదిపాల తిరుపతి రెడ్డి కుమార్తె దూదిపాల ఉదయ భాను 21,000/- రూపాయలను ఆలయ గౌరవ అధ్యక్షులు బొప్పిడి సువర్ణ మల్లారెడ్డి, ఆలయ చైర్మన్ దూదిపాల సౌజన్య అరవింద్ రెడ్డి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధి వినాయక నవగ్రహ ఆలయ పునర్నిర్మాణదాత బొప్పిడి సువర్ణ మల్లారెడ్డి, సుబ్రహ్మణ్యేశ్వర విగ్రహ దాత దూదిపాల అరవింద్ రెడ్డి, సర్పంచ్ మున్ని జలంధర్ రెడ్డి, ఉప సర్పంచ్ బత్తిని వెంకటేష్ గౌడ్, ఎంపిటిసి స్వప్న సుబ్రహ్మణ్యం, గ్రామ పంచాయతీ పాలక వర్గ సభ్యులు, గ్రామ పెద్దలు యువకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.