కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో రెండవసారి దొంగల బీభత్సం

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో ఫిబ్రవరి 25 (నిజం న్యూస్)
కాల్వ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలయం వైపు పెట్రోలింగ్ కు వెళ్లిన కానిస్టేబుల్ పోచన్న, హోంగార్డు వెంకటరమణలు ఆలయ ద్వారం తెరిచి ఉన్నది చూసి చోరీకి యత్నిస్తున్నారనే అనుమానంతో ఆలయంలోకి వెళ్లి చూడగా పోలీసులను చూసిన దొంగ అతను తెచ్చుకున్న పనిముట్లను అక్కడే వదిలేసి పరారయ్యాడు.
పోలీసులు సరైన సమయంలో అటు వైపు వెళ్లడంతో దొంగతనం విఫలమైంది, లేదా ఆలయంలో దొంగతనం జరిగేదని ఎస్సై గంగాధర్ వారిని ప్రశంసించాడు. దొంగతనం శుక్రవారం రాత్రి సమయంలో జరిగినా పోలీసులు శనివారం రాత్రి వరకు ఎలాంటి పత్రికా ప్రకటన చేయకపోవడం గమనార్హం. దేవాలయ జూనియర్ అసిస్టెంట్ మాధవరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.