వీధి కుక్కలు బాబోయ్ !!!!

తెలంగాణా రాష్ట్రంలో వీధి కుక్కల బెడద ఇప్పుడు ప్రజలను భయభ్రాంతులను చేస్తోంది. రోడ్లపై మందలుమందలుగా తిరు గుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి. పాదచారులనే కాదు ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని సైతం వదలటం లేదు. దీంతో స్కూల్‌కు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు- ఏక్షణాన ఎక్కడి నుండి వచ్చి దాడి చేస్తాయోనని భయాందోళనకు గురవుతున్నారు. తమకు వీధికుక్కల బారి నుండి పరిష్కారం చూపడంటూ మున్సిపల్ అధికారులను కోరుతున్నారు. నిన్న ఒక్కరోజునే రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ అధికారులకు మూడు వేలకు పైగా ఫిర్యాదులు వచ్చాయని సమాచారం.అంబర్‌పేట ఘటన మరువకముందే గురువారం నాడు రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల నుండి ఒక్కసారిగా ఎగిసిపడిన నిరసనల కారనంగా వీధికుక్కలు పట్టుకునేందుకు ఆపరేషన్ డాగ్ చేపట్టామని మున్సిపల్ శాఖామాత్య్లు స్వయంగా సెలవిచ్చినా క్షేత్ర స్థాయిలో పరిస్థిరిలో ఏ మాత్రం మార్పు లేదు. రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో ఒక వీధికుక్క ఏకంగా తొమ్మిది మందిపై దాడి చేసింది. గాయపడిన బాధితులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అటు ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలంలో పెద్దగోపతి గ్రామంలో ఇంటిఎదుట ఆడు కుంటున్న 16నెలల చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలో వీధికుక్కలు బీభత్సం సృష్టించాయి. నజురుల్ నగర్ గ్రామంలో నలుగురు చిన్నారులపి అతాక్ చెసి తీవ్రంగా గాయపరిచాయి. వరుస ఘటనలతో బయటతిరగడానికి చిన్నారులు, పెద్దలు భయపడుతున్నా రు. ఫిర్యాదు చేసిన పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జంతు పరిరక్షణ చట్టం వల్ల వీధి కుక్కల సంఖ్య పెరిగి వాటి వీర విహారం కూడా పెరిగిపోయింది. గతంలో గ్రామపంచాయతీలు కుక్కల నియంత్రణకు ఏదో ఒక నియంత్రణ చర్యలు చేపట్టేవారు. కానీ ప్రస్తుతం ఏ గ్రామపంచాయతీ కూడా నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదు. కొత్త వ్యక్తులు గ్రామాల్లో కనిపిస్తే పరుగెత్తించి కరవడమేకాక పొలాలకు వెళ్లే రైతులు వ్యవసాయ కూలీలపై,ఆడుకునే పిల్లలు పై మీదపడి గాయపరుస్తున్నాయి. అదేవిధంగా సాధుజం తువులనై కోళ్లు ఆవుదూడలను గాయపరుస్తున్నాయి. ఈ కుక్కల సమస్యను పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా నియంత్రణ చర్యలు చేపట్టడంలో అలసత్వం వహిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
సి.హెచ్.ప్రతాప్