పేద ప్రజల దాహార్తి తీర్చడం కోసమే చలివేంద్రాలు

డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు ,మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య.
తుంగతుర్తి ఫిబ్రవరి 25 నిజం న్యూస్
వేసవిలో పేద ప్రజల దాహార్తి తీర్చడం కోసమే చలివేంద్రాలు దోహదపడతాయని డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్యలు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద అంబేద్కర్ సెంటర్లో నూతనంగా చదివేంద్రాలను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సుమతి సాధన సభ్యులు డాక్టర్. గాదరి కిషోర్ కుమార్ ఆదేశాల మేరకు వేసవిలో తుంగతుర్తి మండల కేంద్రానికి విచ్చేయుచున్న పేద ప్రజలకు దాహార్తిని తీర్చాలని దృఢ సంకల్పంతో స్థానిక ఎంపిటిసి, పేదల పెన్నిధి, చెరుకు సృజనా పరమేష్ సొంత ఆర్థిక సహకారంతో, చలివేంద్రాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని గ్రామీణ ప్రాంత ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపిటిసి తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ పార్టీ నాయకులు గుండ గాని రాములు గౌడ్, రైతుబంధు జిల్లా కమిటీ సభ్యులు నల్లు రామచంద్రారెడ్డి, కటకం వెంకటేశ్వర్లు గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్, కటకం సూరయ్య, డీప్లా నాయక్ , ఎల్లబోయిన బిక్షం, యాదగిరి, గోపగాని శ్రీను, గుండ గాని దుర్గయ్య శ్రీహరి, రాములు యాదవ్, నాగమల్లు, వీరయ్య సురేష్ శ్రీకాంత్, బొంకూరు విమల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు