మానవత్వం సాటిన హాలియా ఎస్ఐ క్రాంతి కుమార్

కబడ్డి క్రీడాకారుడుకి రెండు_నెలల_జీతం_విరాళం.
హర్షం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, మేధావులు.
హైదరాబాద్ ఫిబ్రవరి 25 నిజం న్యూస్
జాతీయ కబడ్డీ క్రీడకారుడికి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ దగ్గుల క్రాంతి కుమార్ అండగా నిలిచిన మానవత్వాన్ని చాటి హౌరా… అనిపించుకున్న సంఘటన వెలుగు చూసింది.
హాలియా మున్సిపాలిటీకి చెందిన జె .సందీప్ జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రాష్ట్రస్థాయిలో ఆరుసార్లు ఉత్తమ ప్లేయర్ గా నిలిచి… 8 సార్లు నేషనల్స్
ఖేలో ఇండియా విభాగణానికి ఎంపిక అయ్యాడు. కొద్ది నెలల క్రితం హర్యానా ఇండియా కబడ్డీ మాజీ కెప్టెన్ అనూప్ కుమార్ యాదవ్ కోచింగ్ క్యాంప్ హర్యానా లో లెగ్మెంట్ కి గాయం అయ్యింది. ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఎస్సై క్రాంతి కుమార్ క్రీడకారుడికి సర్జరీ నిమిత్తం రెండు నెలల జీతం 1, 60, 522 (ఒక లక్ష అరవై వేల ఐదు వందల ఇరువై రెండు) రూపాయలు విరాళంగా ప్రకటించారు కామినేని డాక్టర్లతో మాట్లాడి బెస్ట్ ట్రీట్మెంట్ చేయిస్తున్న సందర్భంగా క్రీడాకారులు, సందీప్ తల్లిదండ్రులు ఎస్ఐ క్రాంతి కుమార్ కృతజ్ఞతలు తెలుపుతూ, హర్షం వ్యక్తం చేశారు…