గిరిజన బిడ్డ డాక్టర్ ప్రీతి ఆత్మహత్యయత్నం పై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలి

డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి & పిసిసి సభ్యులు డాక్టర్ రాంచందర్ నాయక్
మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 24 నిజం న్యూస్
డాక్టర్ రాంచందర్ నాయక్ మాట్లాడుతూ కాకతీయ మెడికల్ కాలేజ్ మెడికో విద్యార్థిని ధారావత్ ప్రీతి బాయి ను మానసికంగా వేధిస్తూ గత రెండు నెలలుగా హరాస్ చేస్తున్న సైఫ్ ను వెంటనే ఉరితీయాలి.అదేవిధంగా కాలేజీ హెచ్ఓడి,ప్రిన్సిపాల్ లను విధుల నుంచి తొలగించాలి డిమాండ్ చేశారు.జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన గిరిజన తెగకు చెందిన ధారావత్ నరేందర్ దంపతులకు ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు ధారావత్ నరేందర్ రైల్వే శాఖలో ఏఎస్ఐ గా నిధులు నిర్వహిస్తు తన పిల్లల్ని ప్రయోజకులుగా చేయాలని అనేక కష్టనష్టాలు పడి చదివించుకున్నాడు చిన్న అమ్మాయి డాక్టర్ ప్రీతి ఎంబిబిఎస్ పూర్తి చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనస్థీషియా వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరంలో చేరింది.అయితే గత 15 రోజుల నుంచి తమ సీనియర్ వైద్య విద్యార్థి డాక్టర్ ఆసిఫ్ వేధింపులు ఎక్కువ కావడం వలన ముందుగా అమే తల్లిదండ్రులకు తెలియజేయడం జరిగింది
వాళ్ళు పోలీస్ లకు తెలియజేశారు అనంతరం డాక్టర్ ప్రీతిని,డాక్టర్ ఆసీఫ్ లను హెచ్ ఓ డి సమక్షంలో విచారణ జరిపించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని హెచ్చరించారు.ఈ విషయానికి సంబంధించి ఎంజీఎం ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ గారు ,కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ మోహన్ దాస్ గారు విచారణ కమిటీ వేసి డ్యూటీలో ఉన్న సిబ్బందిని కూడా విచారించినట్లు తెలుస్తోంది.22-2-2023 బుధవారం ఎంజీఎం ఆసుపత్రిలో ఉదయం ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ ప్రీతి అక్కడే కుప్పకూలిపోయింది ఇంజక్షన్ ఎక్కువ మోతాదు తీసుకున్నదని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ లోని నిమ్స్ హాస్పిటల్ కు 22-2- 2023 న మధ్యాహ్నం హడావిడిగా తరలించి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, ఆలాగే అసిఫ్ ని శిక్షించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనకు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మోహన్ దాస్ సీనియర్ పీజీ వైద్య విద్యార్థి ఆసీఫ్ ను శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.