న్యాక్ ద్వారా ఇచ్చే శిక్షణను నిరుద్యోగులు వినియోగించుకోవాలి..కొప్పుల సైదిరెడ్డి జెడ్పిటిసి

హుజూర్నగర్ మండలం శ్రీనివాసపురం గ్రామంలో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన కార్మికులకు యూనిఫామ్స్ అందించే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన హుజూర్నగర్ జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి సర్పంచ్ రమ్య నాగరాజు తో కలిసి శిక్షణ పొందిన వారికి యూనిఫామ్స్ హ్యాండ్ బ్యాగ్ హెల్మెట్ ఇతర స్టేషనరిని అందించారు ఈ సందర్భంగా జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం- కార్మిక శాఖ వారి సహకారంతో భవన ఇతర నిర్మాణ రంగా కార్మికుల సంక్షేమ మండలి మరియు నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమ మండలిలో పేరు నమోదయి లేబర్ కార్డు ఉండి 18 సంవత్సరాలు నిండి 45సంవత్సరాలలోపు ఉన్నవారికి తాపీ పని ప్లంబింగ్ ఎలక్ట్రికల్ పెయింటర్లకు 15 రోజులపాటు ఉచిత ఉన్నత నైపుణ్య శిక్షణను అందించడం జరుగుతుందన్నారు శిక్షణ కాలంలో మధ్యాహ్నం భోజనం తోపాటు 15 రోజుల శిక్షణ పూర్తి చేసిన వారికి తెలంగాణ ప్రభుత్వం 4500 రూపాయల స్టైఫండు మరియు సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని తెలియజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా మంత్రివర్యులు జగదీశ్ రెడ్డి సహకారంతో హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి నేషనల్ అకాడమ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ (NAAC) సెంటర్ను హుజూర్నగర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయించి నియోజకవర్గం లోని అనేకమంది నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ రంగాల్లో ఇస్తున్నటువంటి శిక్షణ నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో శిక్షణ రిసోర్స్ పర్సన్ సుదర్శన్ నమ్యా శ్రీనివాస్ వార్డు సభ్యులు శాఖమూరి పాపారావు జింకల వెంకటేశ్వర్లు పి ఎస్ ఎస్ డైరెక్టర్ సాముల నర్సిరెడ్డి కట్ట శ్రీనివాస్ జింకల శ్రీనివాస్ శిక్షణ పొందిన కార్మికులు తదితరులు పాల్గొన్నారు