Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

షర్మిళ రాజకీయ ఎదురీత..!

షర్మిళ రాజకీయ ఎదురీత

– లభిస్తున్న ఆదరణ అంతంత మాత్రమే

– తెలాంగాణా ఇంటి కోడలినన్న వాదనకు లభించని స్పందన

– మీ రాష్ట్ర ప్రజలతో మొర పెట్టుకో అంటున్న బి ఆర్ ఎస్

– హేమాహేమీలను ఎదుర్కొనడం సాధ్యమేనా ?

-రంగంలోకి విజయమ్మ ???

తెలంగాణా రాష్ట్ర వార్షిక బడ్జెట్ పై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అభ్యంతరం చెప్పారు. ఆర్థికమంత్రి హరీశ్ రావు కొత్త సీసా తీసుకుని ఫాంహౌస్ కి వెళితే ఆయన మామ ఆ సీసాలో పాత సారా పోశారని షర్మిల వ్యంగ్యం ప్రదర్శించారు.

 

దీనిపై కడియం శ్రీహరి స్పందిస్తూ, బడ్జెట్ పై షర్మిల వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకమని విమర్శించారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేశారని, ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చారని వివరించారు. కానీ షర్మిల, విజయలక్ష్మికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశాడని కడియం శ్రీహరి విమర్శించారు. వైఎస్ షర్మిల కచ్చితంగా సీఎం అవుతారని జోస్యం చెప్పారు బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. అయితే ఆమె తెలంగాణకు సీఎం కావాలని కలలు కంటున్నారని, ఆ కలలు నెర వేరవని, అన్నీ కుదిరితే ఆమె ఏపీకి సీఎం అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. అంతే కాదు, ఆమె ఆంధ్ర ప్రదేశ్ కు ఎలా సీఎం అవుతారనే విషయంపై కూడా వివరణ ఇచ్చారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. రేపో మాపో ఏపీ సీఎం వైఎస్ జగన్ జైలుకెళ్తారని, ఆయన స్థానంలో ఆయన సోదరి వైఎస్ షర్మిల ఏపీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు కడియం శ్రీహరి.మీ కుటుంబానికి మీ అన్నయ్య జగన్ అన్యాయం చేస్తే నువ్వు ఆంధ్రకు వెళ్ళి అక్కడి ప్రజలతో చెప్పుకో. వాళ్ళే నీకు న్యాయం చేస్తారు. నీకు తెలంగాణాలో ఏం పని అని ఆయన నిప్పులు చెరిగారు. వైఎస్ కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకమని విమర్శించారు. జగన్ జైలుకు వెళ్లినప్పుడు విజయలక్ష్మి, షర్మిల పాదయాత్రలు చేశారని, ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చారని వివరించారు. కానీ షర్మిల, విజయలక్ష్మికి జగన్ రాజకీయంగా అన్యాయం చేశాడని కడియం శ్రీహరి విమర్శించారు. ప్రస్తుతం షర్మిల పాదయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతోంది. తెలంగాణ బడ్జెట్ పై కూడా ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీంతో అదే జిల్లానుంచి బీఆర్ఎస్ నేతలు షర్మిలకు కౌంటర్ ఇస్తున్నారు. కడియం శ్రీహరి ఇచ్చిన కౌంటర్ తో కాస్త కలకలం రేగింది.

 

అయితే తెలంగాణ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి తన చేసిన వ్యాఖ్యలపై పై వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 ఏళ్లు మంత్రిగా ఉండి నియోజకవర్గానికి కడియం చేసిందేమీ లేదని మండిపడ్డారు. దేవాదుల ప్రాజెక్ట్‌తో ఘనపూర్‌కి వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సాగునీరు అందించారని షర్మిల గుర్తుచేశారు. అలాంటి వైఎస్‌ఆర్‌.. తెలంగాణ ద్రోహి ఎలా అవుతారు? అని ఆమె ప్రశ్నించింది. ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు పొందిన ద్రోహి కడియం శ్రీహరని మండిపడ్డారు. ‘‘హామీల రూపంలో మీరు చేసిన మోసాలను బయటపెడతాం’’ అని షర్మిల పేర్కొన్నారు.

 

రాజకీయ వర్గాలలో ఇరు రాష్ట్రాలలో ఈ వ్యాఖ్యలపై చర్చలు జరుగుతున్నాయి.

 

ఇటు షర్మిల రాజకీయ పార్టీపై ఇప్పటికే బి జె పి బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ సహా ఇతర పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. పక్కరాష్ట్రంవారి నాయకత్వం తమకు అవసరం లేదంటున్నాయి. వాటికి ధీటుగా తాను తెలంగాణ కోడల్ని అంటూ ముందుకు వెళ్లాలని షర్మిల ప్రయత్నిస్తున్నారు. ఓ పక్క తెలంగాణ చాంపియన్ అని చెప్పుకుంటున్న బిఆర్ఎస్, ఇంకోవైపు తెలంగాణ ఇచ్చింది మేమేనని చెప్పినా… రెండుసార్లూ గెలవలేకపోయిన కాంగ్రెస్, ఇంకోవైపు ఇలాగైనా ఈసారి గెలవాలనుకుంటున్న బీజేపీ. ఇన్ని పార్టీల మధ్య.. ఆత్మగౌరవం, విధులు, నిధులు, ఉద్యోగాల కోసం పోరాడి పోరాడి సాధించుకున్న తెలంగాణలో షర్మిళకు ఆదరణ ఎలా ఉంటుంది అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.

 

వై ఎస్ షర్మిళ రాజకీయ ప్రవేశంపై పలు పార్టీలు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసాయి. నీళ్ళ పంపకాల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్న తెలంగాణ ప్రభుత్వంపైకి జగనన్న వదిలిన బాణమే షర్మిళ అని కొందరు, రాష్ట్రంలో కొన్ని కీలక కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంచేసి పార్టీని మరింత దెబ్బతీయడానికి టిఆర్ఎస్‌, బిజెపిలు సంధించిన బాణమని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి వంటి నేతలు వాదిస్తున్నారు.

 

తెలంగాణలో టిఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న బిజెపిని అడ్డుకొనేందుకు ఆంద్రా పాలకులనే బూచిని చూపించడానికి టిఆర్ఎస్‌ దింపిన బాణమే షర్మిళ అని బిజెపి నేతలు వాదిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఆరేళ్ళలోనే తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి పధంలో దూసుకుపోతుండటంతో ఓర్వలేక ఆంద్రాపాలకులు తెలంగాణపైకి సంధించిన బాణమే షర్మిళ అని టిఆర్ఎస్‌ నేతలు వాదిస్తున్నారు. ఈ విధంగా ఒక్కో పార్టీ షర్మిళ తెలంగాణ రాజకీయాలలో ప్రవేశాన్ని ఒక్కో కోణంలో నుంచి చూపిస్తూ వాదిస్తున్నాయి.

అయితే తెలంగాణలో పార్టీ పెట్టడం అనేది పొరపాటు చేసినట్లే అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణ వాదం ముందు సమైక్యాంద్ర కోసం పోరాటం చేసిన షర్మిళను తెలంగాణలో ప్రజలు ఆదరించేందుకు అంత సిద్ధంగా లేరని రాజకీయ విశ్లేషకుల భావన.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్త పాదయాత్రలో షర్మిళకు లభించిన ఆదరణ అంతంతమాత్రమేనని, ఇప్పటికీ ఆమెపై పరాయి రాష్ట్రం వ్యక్తి అనే ముద్ర బలంగా వుందని, ఆ ముద్రను తొలగించుకొని, తెలంగాణా ఇంటి కోడలినన్న ఇమేజ్ పెంచుకొని, రాష్ట్రంలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్, బి జె పి వంటి పార్టీలను ఢీకొట్టడం అంత సులువైన పని కాదని రాజకీయ విశ్లెషకులు భావిస్తున్నారు.

సి హెచ్ ప్రతాప్