చిరుత దాడిలో లేగ దూడ మృతి

నారాయణఖేడ్ ఫిబ్రవరి 23(నిజం న్యూస్):సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం లో ర్యాకల్ గ్రామ శివారులో చిరుత పులి కలకలం రేపింది. ర్యాకల్ గ్రామ శివారులో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ర్యాకల్ గ్రామానికి చెందిన బేగరీ లింగయ్య తన వ్యవసాయ భూమిలో ఎప్పటి లాగే లేగ దూడను బుధవారం రాత్రి పూట తన వ్యవసాయ భూమిలో కట్టి ఉంచడు. కట్టి ఉంచిన లేగ దూడపై చిరుత పులి దాడి చేసి లేగ దూడను హతమార్చింది.గురువారం ఉదయం వెళ్లి చూసేసరికి లేగాదూడను చిరుత తినేసి ఉంది.అది గమనించిన రైతు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు.ఈ విషయం తెలుసుకున్న సిబ్బంది సంఘటన స్థలాన్ని పరిశీలించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. చిరుత సంచారంతో కడ్పల్,ఖాజాపూర్, ఖానాపూర్, కిష్టాపూర్,నాగ్ధార్,సంజీవ్ రావు పేట్,ర్యాకల్, పోతన్ పల్లి,చుట్టూ పక్కల గ్రామాల వారు భయాందోళన గురి అవుతున్నారు.కొన్ని నెలల క్రితం కడ్పల్ గ్రామశివారులో,ఖాజాపూర్ శివారులో,సంజీవన్ రావ్ పేట్,కిష్టాపూర్ గ్రామాలలో చిరుత దాడిలో చాలా పశువులు బలి ఐయ్యాయి.ఈ మధ్య వ్యవసాయం పనుల నిమిత్తం అటవీ ప్రాంతానికి వెళ్లాలంటేనే రైతులు బయోందళను గురి అవుతున్నమని రైతులు ఆవేదన వెక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా అటవీ అధికారులు స్పందించి తమకు చిరుత భారీ నుంచి కాపాడాలని రైతులు అధికారులకు ఆవేదన వెక్తం చేతున్నారు.