Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బాల్యం బట్టీల పాలు  

బాల కార్మీకుల చట్టం ఘనంగా అమలు చేస్తున్నామని, రాష్ట్రంలో బాల కార్మీకులనేవారెవరూ లేరన తెలంగాణా కార్మీక శాఖామంత్రి ఇటీవల ఘనంగా అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. అయితే ప్రభుత్వం ,చెప్పేవంబ్నీ పై పై మాతలేనని, బాల కార్మీక నియంత్రణ చట్టం అమలులో చట్టూబండలు అవుతోందని ఇటీవల జరిగిన మరొక సంఘటన నిరూపించింది.

సంగారెడ్డి జిల్లాలోని నారాయణ్ ఖేడ్ వద్ద దర్గా తండాలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ఇసుకబట్టిపై చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు నిర్వహించిన ఆకస్మిక దాడిలో సభ్య సమాజం తలదించుకునే వాస్తవాలు బయట పడ్డాయి. అక్రమంగా తలరించిన కూలీలతో బట్టీ నిండిపోయిందన్న సమాచారం అందుకున్న అధికారులు, పోలీసుల సహాయంతో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 54మంది కూలీలను అక్రమార్కుల చెర నుంచి విడిపించారు. వీరిలో తొమ్మిది మంది 15ఏళ్ల లోపు బాలికలు కావడంతో అధికారులు అవాకయ్యారు. అత్యంత దర్భరమైన పరిస్థితుల్లో , సరైన రక్షణ లేకుండా , సమయానికి పట్టెడన్నానికి కూడా నోచుకోకుండా అభం సుభం తెలియని ఆ చిన్నారులు రేయి పగలు అన్న తేడా లేకుండా, రోజుకు 14-16 గంటల పాటు పని చేస్తున్న వైనాన్ని కళ్లారా చూసి చలించిపోయారు. దాదాపు కూలీలు అందరూ ఒడిషా నుంచి తీసుకురాగా, చిన్నారులు తాము ఎదుర్కొన్న సమస్యలను అధికారులకు మొరపెట్టుకున్న వైనం కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.చాలిచాలని తిండి పెట్టి, ఠారెత్తించే ఎండల్లో పనిచేయిస్తున్నారని ఆ చిన్నారులు కన్నిళ్ళతో వాపోయారు. బాలికల్లో కొంతమంది లైంగిక వేధింపులకు సైతం గురైనట్లు తెలుస్తోంది. రోజుకు రూ.1000 ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు కనీసం రూ.500 కూడా ఇవ్వడంలేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చైల్డ్ ప్రఒటెక్షన్ సెల్ అధికారుల సహాయంతో మైనర్ బాలికలందరినీ హుటాహుటిన సంగారెడ్డిలోని సఖి సెంటర్ కు తరలించారు. మిగిలిన కూలీలను ఓడిషాకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. బాలికలను సైతం తమ ఇళ్లకు పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే సదరు ఘటన ఒక ట్రైలర్ మాత్రమేనని, అభం సుభం తెలియని బాల బాలికలచేత రాష్ట్రం నలిమూలలా అడ్డమైన చాకిరీ చేయిస్తున్నారన్నది విస్పష్టం.

అందరి బాల్యం ఆనందంగా, ఆహ్లాదంగా గడుస్తోందా అన్న ప్రశ్నకు లేదనే సమాధానం వస్తోంది.దు. ఇప్పటికీ- చాలా కుటుంబాల్లో సహజమైన బాల్యాన్ని, ఆ బాల్యపు వికాస క్రమాన్నీ బతుకు తెరువే ఓ బండ బరువై .. నిర్దాక్షిణ్యంగా బందీ చేస్తోంది. వికసించి ప్రకాశించాల్సిన బాల్యాన్ని బలవంతంగా బండబారుస్తోంది. బడికి వెళ్లాల్సిన బాలలు కష్టతరమైన పనుల్లో కునారిల్లడం సమాజాభివృద్ధికి ఆటంకం. అసమానతలు పెచ్చు పెరిగే అన్యాయపు కాలానికి అది ప్రోద్బల కారకం. ప్రపంచవ్యాప్తంగా బడి ముఖం చూడని బాలలు 20 కోట్ల మందైతే .. అందులోని ప్రతి ముగ్గురిలో ఒకరు మనదేశంలోనే ఉన్నారు. కుటుంబాలతో కలిసి లేదా విడిగా వారు కష్టతరమైన పనుల్లో నిమగమై ఉన్నారు. ‘పిల్లలు పుట్టడమే పని కోసం ..’ అన్న మధ్యయుగాల నాటి బతుకు తెరువు వ్యాపకం వారిని నేటికీ వెన్నాడుతోంది.

 

మనదేశంలో బాలలను ప్రమాదకర వృత్తుల్లో పనిచేయించటాన్ని నిషేధిస్తూ 1986లో భారత ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం.. 18 ప్రమాదకర వృత్తులను, 65 ప్రమాదకర ప్రక్రియలను గుర్తించారు. అందులో మందుగుండు సామగ్రి తయారీ, గాజులు, అద్దాల తయారీ వంటి పరిశ్రమలు ఉన్నాయి. కానీ, ఇప్పటికీ శివకాశీ టపాసుల తయారీలో బాలలు పెద్ద సంఖ్యలోనే పాల్గొంటున్నారనే పరిశీలన ఉంది. చట్టాలు చేసినా, చిత్తశుద్ధి లేకపోతే- పరిస్థితి ఇలాగే కొనసాగుతుంది !

మన ప్రభుత్వం 2016 సెప్టెంబరు 1న బాల కార్మికవ్యవస్థ నిర్మూలనకు మరొక ప్రత్యేక చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. 14 ఏళ్ల లోపు పిల్లలు ఎవరూ, ఎక్కడా పనిచేయటానికి వీల్లేదు. ఈ చట్టంపై చర్చ జరుగుతున్నప్పుడే మన రాష్ట్రంలో చాలా పెద్ద హడావిడి జరిగింది. ఇటుకల తయారీ, వస్త్ర పరిశ్రమలపైనా, సెలబ్రిటీల ఇళ్లపైనా దాడులు జరిగాయి. యజమానులకు జరిమానాలు విధించారు. టీవీ ఛానెళ్లు భారీగా ప్రచారం చేశాయి. ఆ తరువాత మళ్లీ అలాంటి ప్రచారమూ లేదు, పర్యవేక్షణా లేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అనేది ఒక తతంగంలా కాదు; ఒక నిరంతర కార్యాచరణగా ఉండాలి.

సి.హెచ్.ప్రతాప్