రసవత్తరంగా ఖమ్మం జిల్లా రాజకీయాలు

ఖమ్మం జిల్లా.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒకప్పుడు వామపక్షాల అడ్డా. తరువాత క్రమక్రమంగా మార్పొచ్చింది. వామపక్షాల హవా తగ్గిపోతూ.. కాంగ్రెస్ పార్టీ )కి జిల్లా ప్రజలు జేజేలు పలికారు. ఆ తరువాత టీడీపీ హవా కొంతకాలం కొనసాగింది. ఆ తరువాత టీఆర్ఎస్ జిల్లాలోకి రంగ ప్రవేశం చేసింది. నిజానికి తెలంగాణ వచ్చిన తొలినాళ్లలో ఆ పార్టీ ఖమ్మం జిల్లాలో ఖాతాను కూడా తెరవలేకపోయింది. ఆ తరువాత క్రమక్రమంగా ఆపరేషన్ ఆకర్ష్ వంటి పథకాలతో జిల్లా ప్రజాప్రతినిధులను వారి అనుచరగణాన్ని తమ పార్టీలో చేర్చుకుంది. అంతే ఖమ్మం జిల్లా దాదాపుగా గులాబీ పార్టీ హస్తగతమైంది.అయితే గత కొద్ది నెలలులా తీవ్ర అసంతృప్తితో వున్న నామా నాగాశ్వరరావు, పొంగులేటి వంటి కీలకనేతలు బి ఆర్ ఎస్ నాయక్త్వంతో విభేదిస్తూ పార్టీ మారడానికి రంగం సిద్ధం చేసుకున్నందున ఇప్పుడు బి ఆర్ ఎస్ ఖమ్మం జిల్లాలో వీక్ అయ్యిందన్న వార్తలు వినవస్తున్నాయి.
ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజిక వర్గానిదే హవా. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పొంగులేటికి రాజకీయంగా ఎదిగే అవకాశం పెద్దగా దొరకలేదనే చెప్పాలి. ఒకవైపు ఆయనకు పెద్దగా అప్పటికి రాజకీయాల్లో అవగాహన లేకపోవడం.. మరోవైపు తల పండిన నేతలుండటం వంటి అంశాలు ఆయనకు ఇబ్బందికరంగా పరిణమించాయి. చివరకు అధిష్టానం కూడా ఆయనను పక్కన పెట్టేయదంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురై టీఆర్ఎస్‌ను వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లాలోని పలు చోట్ల పొంగులేటి సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలతో భేటీ అయిన ఆయన నేడు వైఎస్ విజయమ్మతో సైతం భేటీ అయ్యారు. ఈయన నిష్కృఅమణ బి ఆర్ ఎస్ కు పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
వై ఎస్ షర్మిళ, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు తమ దృష్టిని ఇప్పుడు ఖమ్మం జిల్లాపై కెంద్రీకరించారు. బి ఆర్ ఎస్ ను టార్గెట్ చెస్తూ విమర్సనాస్త్రాలు సంధిస్తున్నారు. విపక్షాల మూకుమ్మడి దాడి నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కాస్త ప్రతికూలంగా మారిన రాజకీయ పరిస్థితులను చక్కదిద్దే పనిలో బీఆర్‌ఎస్ అధినేత ఇప్పుడు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు.. అందులో భాగంగానే హరీష్‌రావును రంగంలోకి దింపి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్‌రావును పార్టీలోంచి బయటకు వెళ్ళకుండా నిలువరించగలిగారు.అయితే అది తాత్కాలికమేనని తెలుస్తోంది. తుమ్ముల బి జె పి లేదా కాంగ్రెస్ వైపు చూస్తునట్లు బలమైన సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన కేసీఆర్ జిల్లాలో కీలకంగా ఉన్న గులాబీ నేతలను అప్రమత్తం చేశారు. ఈ ఇద్దరు నేతలతో పాటు ఇంక ఎవ్వరూ కూడా బి ఆర్ ఎస్ ను వీడకుండా ప్రలోభాల జల్లు కురిపించాలని నిర్ణయించారు.
ఖమ్మం జిల్లాలో బి ఆర్ ఎస్ బలహీనపడిందన్న అంచనాల నేపధ్యంలో పార్టీ బలోపేతం చేయాలని, అందుకోసం వివిధ పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్న బీజేపీ ఆ బాధ్యతలను మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈ-టె-ల రాజేందర్‌కు అప్పగించింది. వచ్చే నెల రోజులపాటు ఈటెల ఖమ్మం పై పూర్తిగా దృష్టి పెట్టనున్నారని సమాచారం.
సి హెచ్ ప్రతాప్