కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్….

చండూరు, ఫిబ్రవరి 22 (నిజం న్యూస్ ) వరంగల్ లో కాంగ్రెస్ యువజన నాయకుడు తోట పవన్ మీద దాడికి నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చండూర్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ కాబడిన వారిలో పన్నాల లింగయ్య , రాపోలు వెంకటేశం, గండూరి నరసింహ,బి. ప్రవీణ్, ఇరిగి శంకర్, సంగెపు భూపతి, యాదయ్య, నరేందర్ తదితరులున్నారు.