మహిళ ప్రాణం కాపాడిన వన్ టౌన్ పోలీసులు

ధర్మవరం ఫిబ్రవరి 22 (నిజం న్యూస్) తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మజీర మండలానికి చెందిన 36 సంవత్సరాలు కలిగిన కంసల కావ్య ను బుధవారం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య యత్నం చేస్తుండగా, డయల్100 ద్వారా వచ్చిన కాల్ మేరకు వన్టౌన్ పోలీసులు సకాలంలో కావ్య ప్రాణాన్ని కాపాడి, మానవతను చాటుకున్నారు. వివరాల ను సిఐ సుబ్రహ్మణ్యం తెలియపరుస్తూ కంశల కావ్య తో పాటు 11 సంవత్సరాల బన్నీ అనే బాలుడు, తొమ్మిది సంవత్సరాల అప్పు అనే బాలిక తన కుటుంబములోని ఆస్తి తగాదాల విషయంలో తన సంతానానికి తీవ్ర నష్టం అవుతుందన్న బాధతో ధర్మవరం రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అనంతరం తన కుటుంబ తగాదాలను, పిల్లల భవిష్యత్తును ఆలోచన చేస్తూ, తనకు ఎవరు న్యాయం చేయార ని, దిక్కు లేదని, ఇక నాకు చావే శరణ్యమని అనుకున్నదని తెలిపారు. తదుపరి ఇద్దరు పిల్లలను ఒక ప్లాట్ఫారం అరుగు మీద తన సెల్ఫోన్ ఇచ్చి కూర్చోబెట్టి, తాను చావు బోతున్నానని సమాచారమిచ్చి, రైల్వే పట్టాలపై వెళ్లిపోయింది అని తెలిపారు. కొడుకు అయిన బన్నీ తన తెలివితో డయల్ 100 కు కాల్ చేశాడని, ఆ డయల్ నెంబర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు సమాచార అందగా ,తాను సిబ్బందిని సకాలంలో పంపడం జరిగిందని తెలిపారు. వన్ టౌన్ కానిస్టేబుల్ రాజప్ప టూ టౌన్ కానిస్టేబుల్ ఉపేంద్ర హుటాహుటిన రైల్వే స్టేషన్ కు చేరుకొని కొడుకు సమాచారంతో రైలు పట్టాలపై పరుగులు తీశారు. ఆ సమయంలో ఏ రైలు రాకపోవడంతో కంసల కావ్యాను ప్లాట్ఫారం వైపుకు తెచ్చి తగిన కౌన్సిలింగ్లను ఇవ్వడం జరిగిందన్నారు. తదుపరి సిఐ కావ్యాకు జరిగిన కుటుంబ తగాదాలను, ఆస్తి తగాదాలను విని, తగిన న్యాయం అధికారుల ద్వారా చేస్తానని తెలిపి పంపించడం జరిగిందని తెలిపారు. మొత్తం మీద ఓ నిండు ప్రాణాన్ని కాపాడుతూ ,ఇద్దరు పిల్లల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టిన సిఐ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ రాజప్ప, ఉపేంద్ర లను పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.