రేషన్ బియ్యం దందాను అడ్డుకునేది ఎవరు?

.*పట్టించుకోని సివిల్ సప్లై అధికారులు.*
.*జోరుగా రేషన్ బియ్యం దందా.*
తిరుమలగిరి ( సాగర్) డిసెంబర్ 22( నిజం న్యూస్)
తిరుమలగిరిమండలంలోని గ్రామీణ ప్రాంతాలలో అనగా డొక్కల బావి తండా అడ్డగా నేతాపురం శీతల తండా మేఘ్య తండా బొజ్య తండా లలో పగలు , సాయంత్రం ఏడు దాటితే ఒక కేజీ 7 నుంచి 8 రూపాయల చొప్పున పేదల కోసం పంపిణీ చేస్తున్న పిడిఎస్ బియ్యం పక్కదారి పడుతున్న అట్టి రవాణాపై ప్రభుత్వం ఆంక్షలు పెట్టినప్పటికీ కొంతమంది దళారులు పిడిఎస్ బియ్యాన్ని భారీ ఎత్తున సేకరించి రాత్రి 12 గంటల ప్రాంతంలో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు సివిల్ సప్లై అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో మునిగి తేలుతున్నారు దానివలన కనీసం పర్యవేక్షణ కరువైందని జనాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి ఇప్పటికైనా సివిల్ సప్లై అధికారులు మేల్కొని ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తే పిడిఎస్ పక్కదారి పోకుండా చూడగలుగుతారు. ఇలాంటి అక్రమాలు కొంతమంది రేషన్ డీలర్లతో సహా వ్యవహారం మండల వ్యాప్తంగా కొనసాగుతుంది దీనికి అధికారులు కట్టుదిట్టమని చర్యలు తీసుకోగలిగితే నివారించగలం .