నకిలీ బంగారం ముద్ద తెచ్చి..పుస్తెల తాడు తీసుకొని

మద్దిరాలా గ్రామానికి చెందిన యరకలి రాదిక @ రేణుకా W/o సైదులు, వయసు:33 సం,,లు, గారి కిరాణం షాపుకు గత 4,5 రోజుల నుండి గుర్తు తెలియని ఒక మగ మనిషి, ఒక ఆడ మనిషి వస్తు ఇక్కడే డ్రిల్లింగ్ పనులు చేస్తున్నాము అని పరిచయం చేసుకొని కిరాణం సామాను కొనుగోలు చేసి నమ్మించి, ఈ రోజు నకిలీ బంగారం ముద్ద తెచ్చి యాదగీరి గుట్ట వద్ద డ్రిల్లింగ్ పనులు చేస్తుంటే దొరికినది, మాకు ఈ ఏరియాలో ఎవరు తెలియదు మీరే అమ్మి పెట్టాలని చెప్పగా, ఫిర్యాది భార్య సైదులు నకిలీ బంగారం అని తెలియక బంగారం షాపు నందు చెక్ చూసుకోయి వస్తాను అని చెప్పి వెళ్ళగా, వారు షాపు వద్దనే ఉండి మరి మేము అంతా బంగారపు ముద్ద ఇంచినాము కదా, నీ భర్త వచె వరకు గ్యారెంటీ కోసం నీ మెడలోని బంగారపు పుస్థుఎల తాడు ఇవ్వమని నమ్మించి అడగగ వారిని నమ్మి ఫిర్యాది రాదిక తన మెడలోని 4 ½ బంగారపు పుస్తెల తాడు తీసి ఆమెకు ఇవ్వగా పిర్యాదిని మాటలలో పెట్టి మోసం చేసి పుస్తెల తాడు తీసుకొని వారిద్దరు వ్యక్తులు షాపు దగ్గరనుని పారి పోయినారు. ఫిర్యాది యరకలి రాదిక ఫిర్యాది మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంబించనైనది