కేంద్ర ప్రభుత్వం పథకాలతో తెలంగాణ ప్రభుత్వం డాంబికం… తల్లోజు ఆచారి

కేంద్ర ప్రభుత్వం పథకాలతో తెలంగాణ ప్రభుత్వం డాంబికం తల్లోజు ఆచారి
మాడ్గుల ఫిబ్రవరి 21 ( నిజం న్యూస్) :
తెలంగాణలో నిజాం పాలన నడుస్తుందని బంగారు తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం రాజ భోగాలు అనుభవిస్తుండగా ప్రజలు సమస్యలతో అష్ట కష్టాలు పడుతుండగా కేంద్ర ప్రభుత్వ పథకాలే ప్రజలకు శ్రీరామరక్షగా మిగిలాయని బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. మంగళవారం మాడుగుల మండలంలోని గిరి కొత్త పల్లి గ్రామంలో శక్తి కేంద్రం కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ గ్రామాల్లో కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేంద్ర ప్రభుత్వ పథకాలేనని ప్రధానమంత్రి నరేంద్రమోడీ విడుదల చేస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగదారిగా పేర్లు మార్చి తెలంగాణ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను అంతమొందించేందుకు ప్రతి ఒక్కరు కంకణబద్ధులై కల్వకుర్తి నియోజకవర్గంలో అలుపెరుగని పోరాటం చేస్తున్న నాకు అండగా ఉండాలని ఆచారి కోరారు. కార్యక్రమంలో మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, బిజెపి సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి, మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జంగయ్య యాదవ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.