గ్లోబల్ పద్మశాలి సదస్సుకు అవ్వారి భాస్కర్

చండూరు, ఫిబ్రవరి 21 (నిజం న్యూస్)…..
ఈనెల 25 ,26 తేదీల్లో దుబాయిలో నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరల్డ్ గ్లోబల్ పద్మశాలి సదస్సుకు మండల పరిధిలోని కొండాపురం గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు మరియు తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వారి భాస్కర్ ప్రత్యేక ప్రతినిధిగా హాజరుకానున్నారు. ఈ సమావేశానికి ప్రపంచ నలుమూలల నుండి వివిధ రంగాల్లో నిపుణులైన పద్మశాలి ప్రముఖులు పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సమావేశంలో పద్మశాలి సమాజం ఎదుర్కొంటున్న రాజకీయ , ఆర్థిక అంశాలపై చర్చలు ఉంటాయని దానితో పాటు వివిధ అంశాలపై భవిష్యత్ కార్యాచరణ ఈ సమావేశంలో రూపొందిస్తారని తెలిపారు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పద్మశాలీలను ఏకతాటిపై తీసుకురావడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు.
గతంలో పద్మశాలి సమాజం నుండి వివిధ రాష్ట్రాల్లో నీ చట్టసభల్లో మరియు భారత పార్లమెంట్లో ప్రతినిధులు ఉండేవారని ప్రస్తుత కాలంలో తిరోగమన దిశలోకి పద్మశాలి సమాజం నెట్టి వేయబడడానికి గలా కారణాలు,ఇట్టి పరిస్థితిని ఎలా అధిగమించాలో ఈ సదస్సులో కూలంకషంగా చర్చించనట్లు చెప్పారు. చేనేతపై జిఎస్టి విధించి చేతి వృత్తులను అతలాకుతం చేస్తున్న జీఎస్టీ విధానంపై చర్చించినట్లు తెలియజేశారు.