Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తెలంగాణ పథకాలు దేశం మొత్తం అమలు చేస్తం

*20 కుటుంబాలు బి ఆర్ ఎస్ లో చేరిక
కారేపల్లి, ఫిబ్రవరి 21,(నిజం న్యూస్): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న పలు సంక్షేమ పథకాలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ అమలు చేయాలని ఖమ్మం పార్లమెంటు సభ్యులు నామా నాగేశ్వరరావు అన్నారు.ఉసిరికాయలపల్లిలోని కోట మైసమ్మ తల్లిని ఎంపీ నామా నాగేశ్వరరావు,ఎమ్మెల్సీ తాతా మధు,వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి, అప్పాయి గూడెం, రొట్టమాకిరేవు గ్రామాలలో ఒక్కొక్కటి 22 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన 3 రైతు వేదికలను టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమా శంకర్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులతో కలసి రిబ్బన్ కత్తిరించి మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉసిరికాయల పల్లిలో జరిగిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎంపీ నామా నాగేశ్వరరావు,ఎమ్మెల్సీ తాతా మధు,వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ లు మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేస్తుందని, అందులో భాగంగానే రైతుల కోసం రైతు వేదికలను నిర్మించారన్నారు. రైతు సంక్షేమం కోసం టిఆర్ఎస్ పార్టీ చేసిన అనేక పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు కేసీఆర్ అని కొనియాడారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ తెలంగాణ వైపుకు చూసేట్టు చేశారని,మానవ రూపంలో ఉన్న మహా మనిషి కేసీఆర్ అని కొనియాడారు.తెలంగాణ రాష్ట్రంలో రైతుల కోసం రైతుబంధు,పంట పెట్టుబడి,రైతు భీమా,ఉచిత విద్యుత్తు వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల కళ్ళలో వెలుగు చూడాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకు మనమంతా ఆయనకు రుణపడి ఉంటామని అన్నారు.ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఇన్ని పథకాలు అమలు అవుతుంటే ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలోనే విద్యుత్ కేవలం ఏడు గంటలు మాత్రమే అందిస్తున్నట్లు నామ విమర్శించారు.అన్ని వర్గాల ప్రజల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్,వంటరి మహిళ,వృద్ధాప్య వితంతు పింఛన్లు, ఆసరా పింఛపింఛన్లు వంటిఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఎందరికో లబ్ధి చేకూర్చిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.ఈ సంక్షేమ పథకాలన్నీ దేశ ప్రజలందరికీ చెందాలనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ పార్టీని,బిఆర్ఎస్ పార్టీగా మార్చారన్నారు. 20 కుటుంబాలు బి ఆర్ ఎస్ లో చేరిక మండలనికి చెందిన 20 కుటుంబాలు మంగళవారం ఎమ్మెల్సీ తాత మధు సమక్షంలో బిఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ తాత మధుసూదన్ వారికి బి ఆర్ ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెసులోని ఈ 20 కుటుంబాల వారు బి ఆర్ ఎస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం గుంపెళ్ళగూడెం గ్రామానికి చెందిన జరపల వీరన్న ఇటీవల మరణించడంతోఆ కుటుంబానికి పార్టీ సభ్యత్వం రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ చెక్కును ను మృతుని కుటుంబానికి అందజేశారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీపీ శకుంతల, జడ్పిటిసి జగన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం. విజయనిర్మల, వైరా డివిజన్ ఏ డి ఏ వి. బాబురావు వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సొసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, ముత్యాల వెంకట అప్పారావు, అడ్డగోడ ఐలయ్య, బత్తుల శ్రీనివాసరావు, నర్సింగ్ శ్రీనివాసరావు, అజ్మీర వీరన్న, అడప పుల్లారావు, ఈసాల నాగేశ్వరరావు, ఈదర కోటేశ్వరరావు ,పాండ్యా నాయక్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు భూక్యా రంగారావు, సర్పంచులు బానోత్ బన్సీలాల్, అజ్మీర అరుణ, ఈసం అరుణ, బానోత్ కుమార్, సొసైటీ డైరెక్టర్లు డేగల ఉపేందర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు పిల్లి వెంకటేశ్వర్లు ,ఏవో ఉమామహేశ్వర రెడ్డి, పార్టీ కార్యాలయ ఇన్చార్జి తొగరు శ్రీను, ఏ ఈ ఓ లు దివ్య, షాహిన్, ప్రకాష్ , నరేష్ , ప్రమీల, పలువురు సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.