కోతుల కరెంట్ ఉచ్చుకు తండ్రి కొడుకులు బలి

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 21 నిజం న్యూస్
మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు అంగోతు సివి(52), అంగోతు కిరణ్(30).. మొక్కజొన్న చెను కౌలు చేస్తున్నారు. తన మొక్క జొన్న చెనుకు కోతుల నుంచి రక్షణ కల్పించేందుకు కరెంట్ ఉచ్చు ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తండ్రి కొడుకు చెనుకు నీరు పెట్టేందుకు వెళ్లగా కొడుకు ఉచ్చులో చిక్కుకొని విద్యుదాఘాతానికి గురైయ్యాడు.. అది చూసి కాపాడేందుకు వెళ్లిన తండ్రి కూడా కరెంట్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి కొడుకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుము కున్నాయి.