నందగిరి గ్రామంలో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలి

పెగడపల్లి ఫిబ్రవరి 20 ( నిజం న్యూస్)
నందగిరి గ్రామంలో గతంలో నిర్మితమైన డబల్ బెడ్ రూమ్ అర్హులైన నిరుపేదలకు గుర్తించి ఇండ్లను ఇవ్వాల్సిందిగా జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో వినతి పత్రం అందజేయడం జరిగింది గతంలో లబ్ధిదారులను గుర్తించినప్పటికీ లబ్ధిదారులకు గృహములు కేటాయించకపోవడం దృష్ట్యా పరిగణలో ఉంచుకొని ప్రస్తుతం ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కేటాయించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు నందగిరి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఉపసర్పంచ్ అశోక్ రెడ్డి వార్డు సభ్యులు గర్వంద వెంకటేష్ గౌడ్ గంగాధర్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.