పట్టాదారుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు

వర్గల్, ఫిబ్రవరి 20 (నిజం న్యూస్)
పట్టాదారుల భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలు జబ్బాపూర్ గ్రామ శివారులో గల భూమి సర్వే నంబర్ (76) గల భూమిలో అక్రమంగా మట్టి తోవుతున్నారు అని గ్రామస్తులు మరియు పట్టాదారులు వాబోతున్నారు తమ స్వంత పట్టా భూముల్లో మట్టిని తోవ్వాలన్న రావాలన్నా మా అంగీకారం తీసుకొని రావాలి మాకు నోటీసులు అయినా పంపాలి కానీ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎవ్వరికి చెప్పకుండా గ్రామ సర్పంచ్ మరియు కాంట్రాక్టర్లు కొందరి అధికారులతో చేతులు కలిపి గుట్టు చప్పుడు కాకుండా మా భూముల్లో రాత్రికి రాత్రి గుంతలు తీసి వాటిని కనిపించకుండా ఉండేందుకు మళ్లీ దగ్గర్లో ఉన్న కాల్వల్లో నుంచి నీళ్లు పెడుతున్నారు అని ఆవేదన చెందుతున్నారు. ఇట్టి విషయం స్థానిక MRO గారి దృష్టికి తీసుకెళ్లిన మాకు ప్రయోజనం లేదన్నారు. ఇందులో బాధ్యతలు దాదాపు 10 మంది ఉన్నారు కానీ ఎక్కువ నష్టపోయిన పట్టాదారులు దోమలపల్లి విట్టల్, నర్సింలు, గణేష్, పెద్దలు, వెంకటేష్, మనోహర్, బాలమణి, శోభ అయితే మీడియా ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నామని చెప్పారు. వెంటనే చొరవ తీసుకోవాలని మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. లేదంటే మాకు న్యాయం జరిగేంతవరకు ఎంత దూరమైనా వెళ్తామని పట్టాదారులు చెప్పడం జరిగింది.