ప్రజాధనంతో ఆటలాడుతున్నారు

-అధ్వానకరంగా తెలంగాణ క్రీడా ప్రాంగణ నిర్మాణం….
చండూరు, ఫిబ్రవరి 20 (నిజం న్యూస్)…. చండూరు మున్సిపాలిటీ పరిధిలో అంగడిపేట లోని ఓంకారేశ్వర ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారు 10 నెలల క్రితం రూ.5 లక్షలతో తెలంగాణ క్రీడా ప్రాంగణ నిర్మాణం చేపట్టారు. భూమిని చదును చేయించి మట్టి కొట్టించారు. బోర్డ్ ఏర్పాటు చేయించారు. వాలీబాల్ ఆటకు సంబంధించి, ఇతర వ్యాయమాలకు సంబంధించిన కొన్ని స్తంభాలను ఏర్పాటు చేయించారు. చుట్టూ మొక్కలు నాటారు . అవి కూడా సరిగా పెరగలేదు చాలా వరకు ఎండిపోయాయి. ఇక అంతే సంగతి ప్రాంగణాన్ని అలాగే వదిలేశారు. నాటి నుంచి ఆడింది ఎవరు లేరు అటువైపు పోయింది ఎవరు లేరు. మొత్తం గడ్డి ముక్కలు , పిచ్చి మొక్కలు పెరిగి అద్వానకరంగా మారింది. ఇంతోటి దానికి తెలంగాణ క్రీడా మైదానం అనే పేరు ఒకటా అంటూ పలువురు అసహనంతో అపహాస్యం చేస్తున్నారు. మైదానం చుట్టూ కంచ ఏర్పాటు చేయించి , ఇతర మౌలిక సదుపాయాలు మెరుగుపరిస్తే చాలా బాగుంటుందని. క్రీడాకారులతో పాటు వ్యాయామం, వాకింగ్ చేయాలనుకున్న యువకులకు, ఇతరులకు చాలా ఉపయోగ ఉంటుందని ప్రజలు అంటున్నారు.