ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

*ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అశ్వాల నృత్యాలు*
*బందోబస్తు పర్యవేక్షించిన ముధోల్ సీఐ వినోద్ రెడ్డి*
ముధోల్ నియోజకవర్గం ప్రతినిధి ఫిబ్రవరి 19 (నిజం న్యూస్)
ముధోల్ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకలు ఆరే మరాఠ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా సంఘం కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహరాజ్, రాజ మాత జిజియా బాయి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.అనంతరం స్థానిక తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ చిత్రపటానికి మజీద్ చౌక్, గాంధీ చౌక్, బస్టాండ్ మీదుగా ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపుకు తీసుకువచ్చిన అశ్వాలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అదేవిధంగా బ్యాండ్ ముందు యువకులు నృత్యాలు చేశారు. అనంతరం శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన దేశం కోసం చేసిన సేవలను వివరించారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండాలని సూచించిన శివాజీ మహారాజ్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లాలని పేర్కొన్నారు. ముఖ్యంగా శివాజీ మహరాజ్ జీవిత చరిత్ర యువకులు చదవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముధోల్ సిఐ వినోద్ రెడ్డి, ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ అసెంబ్లీ నాయకులు రామారావు పటేల్, స్థానిక సర్పంచ్ వెంకటాపూర్ రాజేందర్, బీజేపీ మండల అధ్యక్షుడు కోరి పోతన్న, మాజీ ఎంపీటీసీ పోతన్న యాదవ్, బీజేపీ నాయకులు, ఆరే మరాఠ సంఘం సభ్యులు లక్ష్మణ్ పటేల్, మారుతి, సాయినాధ్ పటేల్, సంతోష్ కదం, మదన్ మోరే, పవన్ పటేల్, మధుకర్, శంకర్ పటేల్, పవన్ జాదవ్, నాగేష్ జాధవ్, యువకులు, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు.