చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలో పాల్గొన్న బండి సంజయ్

గండిపేట్, ఫిబ్రవరి 19 (నిజం న్యూస్): ఆనాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశం కోసం, హిందూ సమాజం కోసం ఎంతో పోరాటం చేశారని, ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ యువతకు పిలుపునిచ్చారు. చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు సందర్భంగా జియాగూడ కేసరి హనుమాన్ టెంపుల్ వద్ద ఛత్రపతి శివాజీ మహారాజ్ సేవాదళ్ ఆధ్వర్యంలో ఆదివారం మహా శోభ యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కరీంనగర్ లో శనివారం ఒక్కరోజు ఎనిమిది శివాజీ మహారాజ్ విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. నేటి యువత శివాజీ మహారాజ్ అడుగుజాడల్లో నడుచుకోవాలి పిలుపునిచ్చారు. తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా కలశం, మామిడితోరణాలున్న పాత సచివాలయాన్ని కూల్చేసి,
ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసం డోమ్ లను నిర్మించారని, హిందుత్వాన్ని తాకట్టు పెడతారా? అని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుస్తుందని, బరాబర్ సెక్రటేరియట్ డోమ్ లను తొలగించి, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా మారుస్తాం అని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఏ సింగ్, పూర్ణచందర్రావు, అంబేద్కర్, ఇంద్రసేనారెడ్డి, శంకర్, వివేక్ సింగ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.