షాక్ గురైన మహిళను కాపాడిన కానిస్టేబుల్ రాధిక

– కానిస్టేబుల్ రాధికను అభినందించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్
మహబూబాబాద్ బ్యూరో, ఫిబ్రవరి 20,నిజం న్యూస్
కురవి మండల కేంద్రంలోని జరిగే భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరైన భక్తురాలు బానోతు నిర్మల భర్త ఇసా వయసు 36 సంవత్సరాలు కులము ఎస్టి లంబాడ గ్రామం పాల్వంచ ఆమె తన కుటుంబంతో కలిసి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగంగా బానోతు నిర్మల అనుకోకుండా వైర్ ముట్టుకోవడంతో కరెంట్ షాక్ కు గురవడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్నటువంటి గూడూరు పోలీస్ స్టేషన్ కు చెందిన డబ్ల్యూపిసి రాధిక జి. ఎన్.ఓ:2060 అను ఆమె కరెంట్ షాక్ కు గురైన నిర్మలకు సి.పి.ఆర్ (నోటి ద్వారా స్వాసను అందించి ఫస్ట్ ఎయిడ్ చికిత్స) నిర్వహించి ఇవ్వడం ద్వారా ఆమె ప్రాణాలను కాపాడింది. తర్వాత వెంటనే ప్రమాదానికి గురైనటువంటి నిర్మలను 108 ద్వారా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ కోలుకోవడం జరిగింది. ఉమెన్ కానిస్టేబుల్ రాధిక ఆమెకి సకాలంలో శ్వాస అందించడం వల్ల ఆమె ప్రాణాలను కాపాడగలిగింది. కావున సకాలంలో స్పందించి ప్రమాదానికి గురైన నిర్మలకు ప్రాణం పోసినటువంటి మహిళ కానిస్టేబుల్ రాధికను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ (ఐ.పీ.ఎస్) మరియు ఇతర ఉన్నత అధికారులు అందరూ కూడా కానిస్టేబుల్ రాధికను అభినందించారు.