ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలి

అక్రమ ఇసుక క్వారీ వద్ద … గ్రామస్తుల ధర్నా
అనుమతులు ఒకచోట తవ్వకాలు మరొక చోట.
అడ్డుఆదుపు లేకుండా ఇసుక రవాణా…. పట్టించుకోని అధికార యంత్రాంగం… మామూళ్ల మత్తులో కిందిస్థాయి అధికారులు..
సూర్యాపేట ప్రతినిధి ఫిబ్రవరి 19 నిజం న్యూస్
మండల పరిధిలోని బిక్కేరు వాగు నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను శుక్రవారం గ్రామస్తులు అడ్డుకొని ధర్నాను చేపట్టారు. ఇసుక క్వారీని వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ నుంచి అనుమతులు తీసుకొని,నాగారం మండల పరిధిలోని పేర బోయిన గూడెం బిక్కేరువాగు నుంచి వందల కొద్ది లారీలలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా విలేకరుల సమక్షంలో గ్రామస్తులు మాట్లాడుతూ ఏలాంటి అనుమతులు లేకుండానే బిక్కురు వాగు నుంచి అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని తద్వారా భూగర్భ జలాలు అడుగంటి తమ పొలాలు బీడు భూములుగా మారుతున్నాయని వాపోయారు.రాత్రి పగలు తేడా అని లేకుండా నిత్యం వచ్చి పోయే ఇసుక లారీల వలన గ్రామస్తులు ఆ రోడ్డుపైన ప్రయాణించడానికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. వే బిల్లులు లేకుండా జీరో దందాతో 50-60 టన్నుల అధికలోడుతో ప్రయాణిస్తున్న ఇసుక లారీల వలన రోడ్డు బీటలు బారి గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరుగుతున్నాయని లారీల రవాణా వలన గ్రామంలో శుభకార్యాలు జరుపుకునే పరిస్థితి లేకుండా పోయిందని బంధువులు ఊళ్ళోకి రావాలంటే జంకుతున్నారని అన్నారు. ఏది ఏమైనా జరుగుతున్న సంఘటన పట్టా జిల్లా కలెక్టర్ జిల్లా పోలీసులు అధికారులు సందర్శించి విచారణ జరిపి పేద ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు…
ఈ కార్యక్రమంలో పేర బోయిన పెద్ద ఉప్పలయ్య అవిలయ్య కంచు గట్ల లింగయ్య అనిల్ మహేందర్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు….