పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మండల ప్రజలందరిపై ఉండాలి

– మండల సీనియర్ నాయకుడు వెంకన్న
మోతే ఫిబ్రవరి 18 (నిజం న్యూస్) మండల పరిధిలోని కూడలి గ్రామంలో శనివారం శివాలయంలో ప్రత్యేక పూజాలు నిర్వహించిన మండల సీనియర్ నాయకుడు దారమల్ల వెంకన్న (కండక్టర్) అనంతరం ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మండల ప్రజలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు.శివరాత్రి రోజున భక్తిశ్రద్ధలతో శివనామం జపిస్తూ చేపట్టే ఉపవాస దీక్షలు, రాత్రి జాగరణ, పూజలు అభిషేకాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతీ ఒక్కరిలో ఆత్మశుద్దిని, పరివర్తనను కలిగిస్తాయని ఆయన అన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో శివరాత్రి పండుగను జరుపుకోవాలని మండల సీనియర్ నాయకుడు దారమల్ల వెంకన్న (కండక్టర్) కోరారు. మహాశివుని కరుణాకటాక్షాలు మండల ప్రజలందరిపై ఉండాలనీ మండల సీనియర్ నాయకుడు దారమల్ల వెంకన్న (కండక్టర్) ఆ మహాదేవుని దీవెనలతో అందరి జీవితాలు సుభిక్షంగా వర్ధిల్లాలని మండల సీనియర్ నాయకుడు దారమల్ల వెంకన్న ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెరుగు ఉపేందర్ నేరేడవాయి ఉపసర్పంచ్ హనుమాన్ చారి గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు బోజ్యా (బాబు) మాజీ ఎంపిటిసి పెరుగు మహేష్, కోర్ర నరేష్,గుగులోతు సీతారాములు (డీలర్) భూక్య నరేష్, భూక్య నాగు, గోపతాండ ఉప సర్పంచ్ గుగులోతు సర్వాన్ దారమల్ల మధుబాబు, భుక్య నవీన్, గుగులోత్ భగవాన్, గుగులోతుజగన్ డాక్టర్ శీను తదితరులు పాల్గొన్నారు