అంతా శివనామస్మరణ..

ఘనంగా ప్రారంభమైన తేగడ తిరునాళ్లు
చర్ల,పిబ్రవరి 18. (నిజం న్యూస్.) మండలంలోని తేగడలోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జాతర మహోత్సవాలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. శివరాత్రి సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటికీటలాడాయి. తీగడులోని భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో స్వామి వారి మేలుకొలుపు ఉత్సవంతో జాతర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారిని గోదావరి స్నాన మహోత్సవాన్ని అర్చక స్వాములు నిర్వహించారు. అర్చన స్వాములు ఎల్లమందల శ్రావణ్ కుమార్, భాను ప్రకాష్ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించిన అనంతరం స్వామివారిని ఊరు రా ఘనంగా ఊరేగించారు..
స్వామివారిని భక్తులు నివేదన పలుకుతూ తెగడ గ్రామానికి తోడుకొని వచ్చారు. అక్కడ స్వామివారి ఆలయంలోకి తీసుకెళ్లిన అనంతరం భక్తులకు దర్శన అవకాశాన్ని కల్పించారు. యలమందల వంశీల ఆధ్వర్యంలో. .. స్వామివారికి సుంకు కొలికే ఉత్సవాన్ని అత్యంత భక్తితో నిర్వహించారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ముక్కుబడులుగా భారీ ప్రభలను కట్టిన విభక్తులు వీర ప్రభలను ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు. ఆదివారం ఉదయం జరిగే స్వామివారి కల్యాణ మహోత్సవానికి జిల్లా నలుమూలన నుంచే కాకుండా సరిహద్దు చతిస్గడ్ నుంచి పెద్ద ఎత్తున ఆదివాసులు తరలివస్తున్నారు. భద్రకాళి అమ్మవారు.. ఆదివాసీలకు ఆడపడుచున్ననుడితో గిరిజనులు ఊరు రా కదలి వస్తున్నారు. ఆలయంలో జాతర సందర్భంగా ఆదివారం తెల్లవారుజామున జరిగే ప్రధాన ఘట్టమైన నారసాల సంబరం చూసేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. నారసాలను బుగ్గలకు, గొంతుకకు, తాలూకాకు పొడుచుకొని వీరశైవులు తమ భక్తిపారవశాన్ని చాటుతారు. అత్యంత భక్తితో జరిగే ఈ సంబరమే జాతరకు హైలైట్ గా నిలుస్తుంది. అనంతరం తెల్లవారుజామున అగ్నిగుండాలను తొక్కే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కొత్తపల్లి ,తేగడ, తదితర గ్రామాల నుంచి స్వామివారికి మొక్కుబడులుగా తయారు చేయించిన భారీ ప్రభలు ఊరేగింపుగా వస్తున్నాయి. జాతర నిర్మాణం కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదివారం జరిగే కళ్యాణానికి ఉత్సవ కమిటీవీస్తూ ఏర్పాటు చేసింది. కళ్యాణానికి ముందు స్వామివారిని వీరప్రభాలతో పల్లకి సేవ నిర్వహించడం ఆనవైతికి వస్తోంది.. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తేగడ తిరునాళ్లకు భక్తులు తరలి వస్తున్నారు