వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రధానం

చర్ల ఫిబ్రవరి 18 (నిజం న్యూస్) మండలంలో గత మూడు రోజులుగా కొరస వెంకటేశ్వరరావు కె వి బి ఈ సివిల్ ఆధ్వర్యంలో శ్రీ సమ్మక్క సారలమ్మ గ్రౌండ్ వాలీబాల్ టోర్నమెంట్ శనివారం ముగిసింది ఈ సందర్భంగా బహుమతుల దాత కొరస వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు సర్పంచ్ కాపల కృష్ణార్జున అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఏజెన్సీలోని యువత లో క్రీడను వెలికి తీసేందుకే ఈ పోటీలను మూడు రోజులుగా నిర్వహించినట్లు తెలిపారు క్రీడలు ఉల్లాసాన్ని. ఉత్సాహాన్ని శరీర దృడుత్వాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు అనంతరం వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ప్రధమ విజేతగా నిలచిన చర్ల మండలం సుందరయ్య కాలనీ జుట్టుకు రూ.20.వేల 116. ద్వితీయ విజేతగా నిలిచిన దుమ్మగూడెం మండలం మారేడుబాక జట్టుకు.రూ 15.వేల.116. తృతీయ విజేతగా నిలిచిన చర్ల మండలం సుబ్బంపేట జట్టుకు.రూ10. వేల116 బహుమతులతో పాటు సిల్డును అందజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సోయం రాజారావు కుంజా శ్రీనివాస రావు రైతు క్లబ్ చైర్మన్ కొత్తపల్లి రామాంజనేయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు