రైతుల మోసం చేసిన కేసీఆర్

-సాగునీరు కాదు త్రాగునీరు అని మాట మార్చిన కేసీఆర్.
– మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
చేవెళ్ల, ఫిబ్రవరి 18(నిజం న్యూస్)
ఎన్నికల సమయంలో కెసిఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో రంగారెడ్డి జిల్లా,పాలమూరు జిల్లాలకు సాగునీరు అందిస్తానని కేసీఆర్ మళ్ళీ మాట మార్చాడని చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం చేవెళ్ల మండల కేంద్రంలో బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికలు వస్తేనే చేవెళ్ల,వికారాబాద్,తాండూర్,పరిగి ప్రాంతాలు గుర్తుకు వస్తాయని చేవెళ్ల ప్రాంతానికి చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టు పోయి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు వచ్చిందని అందులో కూడా మోసం జరిగిందని అన్నారు. ఎన్జీటీ (నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్) పాలమూరు రంగారెడ్డి రీ డిజైన్ ప్రాజెక్టు సరైనది కాదని దీని వలన ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉందని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి 925 కోట్లు భారీ జరిమానా విధించిందని అన్నారు. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లిన టిఆర్ఎస్ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సాగునీరు ప్రాజెక్టు కాదని త్రాగునీరు ప్రాజెక్టు అని మరోసారి రంగారెడ్డి, పాలమూరు జిల్లా రైతులను తన మాటలతో మోసం చేశారని మండిపడ్డారు. ఇలాంటి మోసకారి ప్రభుత్వాన్ని రానున్న రోజులలో ప్రజలు రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గ ఇన్చార్జి కంజార్ల ప్రకాష్, చేవెళ్ల మండల కార్యదర్శి అత్తిలి అనంతరెడ్డి, మండల ఉపాధ్యక్షులు కేశపల్లి వెంకట్రాంరెడ్డి, వెంకట్ రెడ్డి, అశోక్ శేఖర్ రెడ్డి రంజిత్ తదితరులు పాల్గొన్నారు.