ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

కుబీర్ (నిజం న్యూస్ ఫిబ్రవరి 17)తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ జన్మదిన వేడుకలను కుబీర్ మండలం లో శుక్రవారం రోజున ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, మండల బిఆర్ఎస్ నాయకులతో కలిసి మార్కెట్ కార్యాలయంలో, ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ రేకుల గంగా చరన్, వైస్ ఎంపీపీ మొయినుద్దీన్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు అనిల్, తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పుప్పాల పిరాజి, కోఆప్షన్ సభ్యుడు మోరె దత్తహరి పటేల్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గాడేకర్ రమేష్, సర్పంచులు, ఎంపీటీసీలు బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.