కుబీర్ లో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

కుబీర్(నిజం న్యూస్ ఫిబ్రవరి 17) : రైతులు పండించిన పంటను ప్రైవేట్ దళారులకు అమ్మకుండా పంటకు తగిన గిట్టుబాటు ధర కల్పిస్తు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో తమ పంటను విక్రయించుకోవాలని ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన కుబీర్ లోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శనగ కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు ప్రయివేట్ దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.రైతుల కష్టం వృధాకాకుండా ప్రభుత్వం పంటకు తగిన గిట్టుబాటు ధర క్వింటాల్ శనగకు 5335 రూపాయలను అందిస్తోందని తెలిపారు. పంట విక్రయించిన కొద్దీ రోజులలోనే రైతుల ఖాతాలో డబ్బులు జమవుతాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రైతుల కొరకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.రైతుల సంక్షేమానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు.రైతులు లాభసాటిగా ఎదగాలనే లక్ష్యం లో భాగంగా వారు పండించిన పంటలు కొనుగోలు చేసేందుకు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో పిఎసిఎస్ చైర్మన్ రేకుల గంగాచరన్, వైస్ ఎంపీపీ మోయినుద్దీన్, తెరాస జిల్లా ప్రధాన కార్యదర్శి తూము రాజేశ్వర్, మండల కో ఆప్షన్ సభ్యులు దత్త హరి పటేల్, కుబీర్ మండల బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిల అనిల్, ఎక్స్ జెడ్పిటిసి సింహం శంకర్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు గాడేకర్ రమేష్, సర్పంచులు, ఎంపీటీసీలు, బిఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.