అన్నారం బ్రిడ్జి గ్రామంలో ఎంపీపీ మధ్యాహ్న భోజనం పరిశీలన ఎంపీపీ నెమ్మాది బిక్షం

పెన్ పహాడ్ మండలం ఫిబ్రవరి 17 నిజం న్యూస్
మండల పరిధిలోని అన్నారం బ్రిడ్జి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం ఎంపీపీ నెమ్మాది బిక్షం ఆకస్మికంగా మధ్యాహ్న భోజనం పరిశీలించినారు ఆయన మధ్యాహ్న భోజనములో కూరలు మంచిగా రుచికరముగా ఉంటున్నాయా? భోజనం సరిపోను పెడుతున్నారా? అని పిల్లలను అడిగి వివరణ తెలుసుకున్నారు, ఉపాధ్యాయులు విద్యాబోధన విషయం గురించి పిల్లలను వివరణ అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ హాస్టల్లో పాఠశాలల్లో సన్న బియ్యం అందిస్తుందని ఆయన అన్నారు నాణ్యమైన విద్య నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే సీఎం కేసీఆర్, గుంతకండ్ల జగదీష్ రెడ్డి, లక్ష్యం అని అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీసాల రమణ దేవయ్య, మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్ మాజీ సర్పంచ్ దేవయ్య, గ్రామ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు మీసాల లింగయ్య, ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు