కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి..ఎంపీపీ నెమ్మాది బిక్షం

పెన్ పహాడ్ ఫిబ్రవరి 17 (నిజం న్యూస్):
కంటి వెలుగు సద్వినియోగం చేసుకోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ నెమ్మాది బిక్షం అన్నారు. శుక్రవారం అన్నారం బ్రిడ్జి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కంటి సమస్యలు ఉన్నవారు గ్రామంలోని నిర్వహిస్తున్న కంటి వైద్య శిబిరానికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. అవసరం ఉన్నవారికి కంటి అద్దాలను ఉచితంగా అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దొంగరి యుగేందర్, పిఎసిఎస్ చైర్మన్ నాతల జానకి రామ్ రెడ్డి, గ్రామ సర్పంచ్ మీసాల రమణ దేవయ్య, మాజీ సర్పంచ్ మీసాల దేవయ్య, గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మీసాల లింగయ్య ,మండల వైద్యాధికారి శ్రావణి, హెచ్ ఈ ఓ చంద్రశేఖర్ రాజ్, వెంకటరమణ, , , జూనియర్ డాక్టర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.