నేరేడవాయి, గోపతండ గ్రామాలలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 70వ పుట్టినరోజు వేడుకలు

మోతే ఫిబ్రవరి 17 (నిజం న్యూస్)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 70వ జన్మదిన వేడుకలను మండల పరిధిలోని నేరేడవాయి గోపతండ గ్రామపంచాయతీలో మండల సీనియర్ నాయకుడు దారమళ్ళ వెంకన్న (కండక్టర్) నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు గుగులోతు బోజ్యా (బాబు) ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ లు వార్డ్ మెంబర్స్ గ్రామ యువకులు విద్యార్థులు అందరూ కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు జరిపి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు బాటలు వేసి అభివృద్ధిని ఆదర్శంగా నిలిపిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు హనుమచారి, జి సర్వాన్ ఎంపిటిసి పెరుగు మహేష్, డాక్టర్ శీను యువనాయకులు కోర్ర నరేష్, దారమళ్ళ మధు(బాబు) భూక్య నరేష్, భూక్య నాగు, భూక్య నవీన్, గుగులోతు భగవాన్, గుగులోతు జగన్ తదితరులు పాల్గొన్నారు