తేగడలోని మహా మండపాన్ని ప్రారంభించిన దాతలు

చర్ల ఫిబ్రవరి 17 (నిజం న్యూస్) మండలంలోని తేగడ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆలయ మహా మండపాన్ని చర్లకు చెందిన మాజీ గ్రంథ పాలకులు శివ్వారపు వీర భోగా చారి ఆయన సతీమణి ఈశ్వరమ్మ దంపతులు.కుమారుడు నరేష్ కోడలు లావణ్య దంపతులు. శుక్రవారం ప్రారంభించారు
ఈ మహా మండప నిర్మాణానికి అవసరమైన రూ 15 లక్షల విరాళాన్ని ఆ కుటుంబసభ్యులు విరాళంగా అందజేశారు ఆలయ అర్చకులు ఎల్లమందల శ్రావణ్ కుమార్ భాను ప్రకాష్ నేతృత్వంలో ఈ సందర్భంగా విశేష పూజలు జరిగాయి మహా మండప దాతలు తొలుత ఆలయంలోని స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు వారికి అర్చక స్వాములు ఆశీర్వాచనాలుతో దీవించారు