మాడ్గులలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

మాడుగుల ఫిబ్రవరి 17 ( నిజం న్యూస్)y
మండల కేంద్రమైన మాడుగుల నూతన గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎమిరెడ్డి జైపాల్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వల్ల నేడు తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను అందజేయడంతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అంబాల జంగయ్య గౌడ్, ఉపసర్పంచ్ మిద్దె రాములు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు గౌని లాలయ్య గౌడ్, మాజీ ఎంపీపీ జర్పుల జైపాల్ నాయక్, ప్యాక్స్ డైరెక్టర్ కల్లు రాజ వర్ధన్ రెడ్డి, మండల రైతు బంధు సమన్వయ సభ్యులు ఉడుతల యాదయ్య గౌడ్, రైతు సమన్వయ సమితి గ్రామాల అధ్యక్షులు పాలకూర్ల రాజు గౌడ్, వెంకటయ్య గౌడ్, నాయకులు బట్టు భూపతిరెడ్డి, గొర్రె పవన్ కుమార్ రెడ్డి, మల్లేష్ యాదవ్, యాతం జంగయ్య యాదవ్, మసన విష్ణు నేత, అన్నపాక మహేష్, పలేటి యాదయ్య, సుర మల్ల చెన్నయ్య, కోరుకోరు తిరుపతి , చంద్రయ్య గౌడ్, ఆరోగ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.