మరిపెడ లో మళ్లీ మొదలైన దొంగతనాలు

పోలీసులకు సవాలు విసురుతున్న దొంగలు
వరుసగా నాలుగు షాపులలోచోరీ
భయాందోళనకు గురవుతున్న వ్యాపారస్తులు
మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి17 నిజం న్యూస్
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో బస్టాండ్ సమీపంలో ఉన్న రాజబెల్లీ చికెన్ సెంటర్, వేదశ్రీ ఫుట్వేర్, మార్కండేయ ఎలక్ట్రికల్ షాప్, మణికంఠ మిల్క్ సెంటర్ లలో గత రాత్రి దొంగలు పడ్డారు. పక్కనే ఉన్న మెడికల్ షాపులో చోరీకి ప్రయత్నించినప్పటికీ ఐరన్ జాలి ఉండటంతో సాధ్యం కానట్లు తెలుస్తోంది.వెనక నుండి తలుపులు పగలకొట్టి దొంగలు లోనికి వెళ్లినట్లు తెలుస్తోంది. మండల పరిధిలో వరుస దొంగతనాలు ఇటీవల కాలంలో కలకలం రేపి కొద్దిరోజుల విరామం తర్వాత ఒకేరోజు వరసగా ఐదు షాపులలో దొంగతనం జరగడం పోలీసులకు పెను సవాలుగా మారింది. ఈ సంఘటనను చూసి వ్యాపారస్తులు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.పోలీసులు వెంటనే ఈ కేసును చేదించి వారి పై కఠిన చర్యలు తీసుకొని మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.