మాడ్గులలో భవ్య ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రారంభం

మాడ్గుల ఫిబ్రవరి 16 ( నిజం న్యూస్):
రుచికరమైన భోజనం అందించడంతో పాటు హోటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా యజమాన్యం చొరవ చూపితే వ్యాపారంలో రాణించవచ్చని ఉప సర్పంచ్ మిద్దె రాములు అన్నారు. గురువారం మండల కేంద్రమైన మాడుగుల గ్రామంలోని ఇందిరమ్మ కూడలి వద్ద భవ్య ఫ్యామిలీ రెస్టారెంట్ ను ఉప సర్పంచ్ రాములు, మాడ్గుల విజయ డైరీ చైర్మన్ జెళ్ళ యాదయ్య లు ప్రారంభించారు. కార్యక్రమంలో మాడుగుల పౌల్ట్రీ ఫామ్ నిర్వాహకులు హనుమంతరావు, విశ్వబ్రాహ్మణ సంఘం మండల నాయకులు కాసోజు విష్ణువర్ధనాచారి, మాడ్గుల మండల టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ అధ్యక్షుడు సామల నిరంజన్ గౌడ్, నాయకులు మస్న విష్ణునేత, చిక్కుడు జంగయ్య, అన్నేపక మహేష్, శ్రీను, కాటం, అన్నే పాక అంజయ్య, మల్లయ్య, శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.