ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ.. యువకుడు మృతి

మహబూబాబాద్ బ్యూరో ఫిబ్రవరి 16 నిజం న్యూస్
గూడూరు మండల కేంద్రంలోని నర్సంపేట రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ ముందు లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన సంఘటన లో దన్నసరి లక్ష్మయ్య (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి.
ప్రభాకర్ అనే వ్యక్తి తో పాటు మరోకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.వారిని చికిత్స నిమిత్తం వెంటనే వరంగల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారువారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలిసింది.
మహబూబాబాద్ జిల్లా గంగారాం మండల కేంద్రానికి చెందిన వారిగా గుర్తించారు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.