పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్ ప్రెస్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఫిబ్రవరి15 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ వద్ద
గోదావరి ఎక్స్‌ప్రెస్ రైలుకు పెను ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ బీబీనగర్ వద్ద పట్టాలు తప్పింది..దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.అయితే రైలు వేగం తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.ఈ ఘటనతో కాజీపేట- సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.