Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఏపూర్ లో దారుణ హత్య …వ్యవసాయ క్షేత్రంలో నిద్రిస్తున్న వ్యక్తి హత్య

 

వేరైనా తలమొండెం.

ఆత్మకూరు ఎస్ ఫిబ్రవరి 15 (నిజం న్యూస్):

వ్యవసాయక్షేత్రంలో నిద్రిస్తున్న వ్యక్తి పైగుర్తు తెలియని వారు గొడ్డలితో దారుణంగా హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని ఏపూరు శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం గ్రామానికి చెందిన గుండపల్లి వీరయ్య 43. మంగళవారం ఉదయం తన మిరప తోటకు నీళ్లు పెట్టేందుకు వెల్లాడు. విద్యుత్ సరఫరా బంద్ కావడంతో తను మిరప తోటలో నిద్రిస్తుండగా హత్యకు గురైయ్యడు. మిరప తోటలో నిద్రిస్తున్న వీరయ్యను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో దాడి చేయగా తల మొండెం వేరు అయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం వరకు ఇంటుకి రాక పోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, కుటుంబ సభ్యులు వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లారు. సెల్ లైట్ తో మృతుడు వీరయ్య ను మిరప తోట లో వెతుకుతుండగా హత్య కు గురై ఉన్నట్లు గమనించారు , సమాచారం అందిన పోలీస్ లు సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య జరిగిన పరిసరాలను బట్టి చూస్తే మధ్యాహ్నం మూడు నుండి నాలుగు గంటల మధ్యలో హత్య జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గొడ్డలి తో మెడమీద ముఖంపై అతి దారుణం గా నరకడం తో తల మొండెం వేరైంది. రక్తం పూర్తిగాఎండిపోయి ఉంది. మృతుడు వీరయ్య గ్రామంలో వివాద రహితుడని ఎలాంటి రాజకీయ విభేదాలు లేవని గ్రామస్తులు తెలిపారు. గతంలో వీరయ్య చాపల చెరువు సొసైటీ ఉప చైర్మన్ గా పని చేశారు. భార్య సైదమ్మ వార్డ్ మెంబర్ గా ఉన్నారు. భూతగాథలు కానీ అక్రమ సంబంధం కారణంగా గాని హత్యకు గురై ఉండొచ్చని గ్రామస్తుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడు వీరయ్యకు భార్య కూతురు కుమారుడు ఉన్నారు. సూర్యాపేట రూరల్ సీఐ సోమనారాయణ సింగ్ ఎస్సై యాదవేందర్ రెడ్డి, తమ సిబ్బందితో చేరుకున్నారు. హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు…..