ఉచితంగా బుక్స్ పంపిణీ

గండిపేట్, ఫిబ్రవరి 13 (నిజం న్యూస్): పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ గ్రీన్ ల్యాండ్ ఆధ్వర్యంలో పోలీస్ ఉద్యోగ కోసం పోటీపడుతున్న అభ్యర్థులకు ఉచితంగా బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కీమ్స్ ఆస్పత్రి చైర్మన్ భాస్కరరావు మాట్లాడుతూ కష్టపడితే జాబు గ్యారంటీ అని అభ్యర్థుల కు సూచించారు. కేవలం రెండున్నర నెలలోనే సమయం వృధా చేయకుండా కష్టపడి చదివితేనే సుమారు కొన్ని సంవత్సరాలు పాటు పోలీస్ రంగంలో సేవ చేసేందుకు అవకాశం లభిస్తుందని రాచకొండ క్రైమ్ డిసిపి పరావస్తు మధుకర్ స్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు వందమంది పైగానే బుక్స్ ను ఉచితంగా పంపిణీ చేశారు. ప్రముఖులు విద్యాభూషణ్, లక్ష్మీ కుమారి, సరస్వతి, సుమతి, గులాబీ రామ్, ప్రవీణ్, రాజ్ కుమార్ లు తదితరులు పాల్గొన్నారు